కేటీఆర్ హామీలు
ఎలక్షన్ స్టంట్లు: కాంగ్రెస్
సత్తుపల్లి, వెలుగు: భద్రాచలం సీతారామచండ్రుడు సీఎం కేసీఆర్ఫ్యామిలీని క్షమించడని, భగవంతుని పేరుతో అబద్ధాలు చెప్పిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్విజయకుమార్ అన్నారు. ఆదివారం తన క్యాంప్ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. సీఎం హోదాలో సీతారాములకు ఒక్కసారి కూడా పట్టు వస్త్రాలు సమర్పించకపోవడం దురదృష్టకరం అన్నారు. రాముడి ఆగ్రహంతో వర్షం పడి మంత్రి కేటీఆర్భద్రాచలం పర్యటన రద్దయిందని చెప్పారు.
కేసీఆర్ ను, ఆయన కుటుంబ సభ్యులను స్వామివారు ఉపేక్షించబోరన్నారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్జెండా పట్టుకోవడానికి భయపడే రోజుల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్రాజకీయంగా వాడుకుని వదిలేశారని మండిపడ్డారు. వారిద్దరి ప్రజాబలం ఏమిటో వచ్చే ఎన్నికల్లో చూస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీని ముసలి నక్కగా వర్ణించిన కేటీఆర్ తనను తానే పిల్ల కాకిగా ముద్ర వేసుకున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్పిట్టల దొర అయితే కేటీఆర్ తుపాకీ రాముడని విమర్శించారు.
సత్తుపల్లిలో ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల స్టంట్లు అని, ఎవరూ నమ్మొద్దని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు గాదె చెన్నారావు, దుండేటి వీరారెడ్డి, ఇమ్మనేని ప్రసాద్ రావు, దొడ్డా శ్రీనివాస్ రావు, కర్లపూడి రామారావు, నరకుల్ల అప్పారావు, వంగరి రాకేష్, సందీప్ గౌడ్,ఇనూస్, వడ్డే రామారావు, మల్లెల్లి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.